హైదరాబాదులోనే రజనీకాంత్ సినిమా షూటింగ్!

  • రజనీ 169వ సినిమాకి సన్నాహాలు 
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 
  • నిర్మాణ సంస్థగా సన్ పిక్చర్స్ 
  • వచ్చేనెల నుంచి హైదరాబాదులో షూటింగ్
రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 169వ సినిమా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగు ఎక్కువగా హైదరాబాదులో జరగనుందని సమాచారం. 

హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్స్ వేయిస్తున్నారట. మేజర్ పార్టు షూటింగు ఇక్కడే జరగనుందని అంటున్నారు. వచ్చేనెల నుంచి ఈ సెట్స్ లో షూటింగు మొదలవుతుందని చెబుతున్నారు. ఈ సెట్స్ కోసం భారీ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నట్టుగా టాక్.

ఇటీవల కాలంలో రజనీ తన సినిమాల షూటింగులు హైదరాబాదులో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. 'పెద్దన్న' షూటింగు కూడా ఇక్కడే ఎక్కువ భాగం షూటింగు జరుపుకుంది. ఇక అజిత్ కూడా హైదరాబాదులో షూటింగు చేయడానికి ఆసక్తిని చూపుతుండటం గమనించవలసిన విషయం.


Rajanikanth
Nelson Dileep Kumar
Kollywood

More Telugu News